ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన వ్యక్తికి సత్కారం

గద్వాల గురుకుల పాఠశాలకు చెందిన కృష్ణ, జోగులాంబ జోనల్ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శనివారం పాఠశాల ప్రిన్సిపాల్ కె.రాజు, ఉపాధ్యాయ బృందం ఆయనను ఘనంగా సత్కరించారు. విద్యారంగంలో ఆయన చేసిన నిరంతర కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం లభించిందని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. విద్యార్థులు ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు.