VIDEO: 'ధర్నాను జయప్రద చేయండి'
ELR: ఈ నెల 16న ఏలూరులో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కే.వి రమణ పిలుపునిచ్చారు. మంగళవారం బుట్టాయిగూడెం మండలం కే.ఆర్ పురం ఐటీడీ వద్ద సివిల్ సప్లై హమాలీల సమావేశం నిర్వహించారు. అసంఘటిత రంగ కార్మికులకు హామాలీలకు పని భద్రతతో కూడిన ఉపాధి హామీ చట్టం చేయాలని, వారికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు.