మంత్రి నాదెండ్లను కలిసిన ఏపీటీఎఫ్ నాయకులు

GNTR: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు ఆదివారం మంత్రి నాదెండ్ల మనోహర్‌ను కలిశారు. తెనాలిలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. సీపీఎస్ రద్దు చేయాలని, మెమో 57ను అమలు చేయాలని కోరారు. 12 వ పీఆర్సీ కమిషన్‌ను నియమించి ఐఆర్ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.