ఆరిలోవ రైతు బజార్‌లో స్టాళ్ల కేటాయింపునకు డ్రా

ఆరిలోవ రైతు బజార్‌లో స్టాళ్ల కేటాయింపునకు డ్రా

విశాఖ: ఆరిలోవ రైతు బజార్‌లో ఖాళీగా ఉన్న స్టాళ్ల కేటాయింపు పూర్తిగా పారదర్శకంగా జరుగుతోందని జేసీ మయూర్ అశోక్ తెలిపారు. అక్టోబర్ 22న నిర్వహించిన డ్రాలో 50 మంది రైతులకు స్టాళ్లు కేటాయించగా.. నేడు డ్వాక్రా సభ్యుల కోసం 10 స్టాళ్లు, వికలాంగుల కోసం ఒక స్టాల్ కేటాయించనున్నారు. కలెక్టర్ కార్యాలయంలో డ్రా నిర్వహించి తుది కేటాయింపులు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.