అభివృద్ధికి దిక్సూచిగా రాష్ట్ర బడ్జెట్: MLA
NDL: రాష్ట్ర బడ్జెట్ 2026 అభివృద్ధికి దిక్సూచిగా ఉందని MLA గిత్త జయసూర్య కొనియాడారు. సోమవారం నందికొట్కూరులో ఆయన మాట్లాడుతూ.. రూ.3,32,205 కోట్లతో ప్రవేశపెట్టిన ఏపీ బడ్జెట్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి భరోసా కల్పిస్తోందని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు.