VIDEO: జాంపేటలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు

VIDEO: జాంపేటలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు

E.G: రాజమండ్రిలోని జాంపేటలో ఉన్న శ్రీ కోదండరామ శిరిడి సాయి విజయ కనక దుర్గ మందిరంలో శ్రీరామనవమి వేడుకలు ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. నగర నలుమూలల నుంచి భక్తులు విచ్చేసి రాముల వారి కళ్యాణాన్ని వీక్షించారు. అనంతరం వారు తీర్థప్రసాదాలు స్వీకరించారు.