సింగరాయకొండలో ఆరుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్
ప్రకాశం: సింగరాయకొండలో ఎస్వీ లాడ్జిలో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై మహేంద్ర గురువారం తెలిపారు. వారి వద్ద నుంచి ఏడు సెల్ ఫోన్లు, రూ.20,300 నగదును సీజ్ చేశామన్నారు. పక్కా సమాచారం మేరకు ఎస్వీ లాడ్జిపై దాడి చేయగా.. ఆరుగురు పేకాడుతూ పట్టుపడ్డారన్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచార వస్తున్నట్లు ఆయన వెల్లడించారు.