ఎట్టకేలకు తీరిన సిగ్నల్ సమస్య.. గ్రామస్తులు హర్షం

ఎట్టకేలకు తీరిన సిగ్నల్ సమస్య.. గ్రామస్తులు హర్షం

MHBD: కొత్తగూడ మండలం గుండంపల్లి గ్రామంలో చాలా కాలంగా సెల్ సిగ్నల్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులకు ఊరట లభించింది. బీఎస్ఎన్ఎల్ టవర్ ఏర్పాటైనా సిగ్నల్ రాకపోవడంతో నిరీక్షణలో ఉన్న ప్రజలకు నేడు సిగ్నల్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఇక పై ఫోన్ కాల్స్, ఇంటర్నెట్ సేవలు సాఫీగా ఉంటాయని విద్యార్థులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.