భద్రాచలం నుంచి మంచిర్యాలకు ఏసీ బస్సు సర్వీస్

BDK: ప్రయాణికుల సౌకర్యార్థం భద్రాచలం నుంచి మంచిర్యాలకు ప్రత్యేక ఏసీ బస్సు సర్వీసు నడుపుతున్నట్లు RTC డీఎం తిరుపతి తెలిపారు. ఈ సర్వీస్ ప్రతి రోజూ రాత్రి 7 గంటలకు భద్రాచలం నుంచి బయలుదేరి మంచిర్యాల చేరుకుంటుంది. తిరిగి మంచిర్యాల నుంచి సాయంత్రం 6 గంటలకు భద్రాచలానికి బయలుదేరుతుంది. ఈ బస్సు కొత్తగూడెం, ఇల్లందు, హనుమకొండ, కరీంనగర్, గోదావరిఖని మీదుగా మంచిర్యాలకు చేరుతుంది.