సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
ఖమ్మం నగరంలో 24 గంటల పాటు తాగునీటి సరఫరాకు చర్యలు చేపట్టామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రూ. 220 కోట్ల అమృత్ పథకం పనులు వేసవి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 35వ డివిజన్లో రూ. 50.25 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన నిన్న చేశారు. ప్రతి ఒక్కరూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.