కూలిపోయిన ఇళ్లను పరిశీలించిన ఎస్సై

కూలిపోయిన ఇళ్లను పరిశీలించిన ఎస్సై

NZB: మోపాల్ మండలం బైరాపూర్‌లో కూలిపోయిన ఇళ్లను ఎస్సై సుస్మిత సిబ్బందితో కలిసి సోమవారం సందర్శించారు. కూలిపోయిన ఇళ్లు,కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో పెంకుల ఇళ్లలో ఉంటున్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం గ్రామంలో పర్యటించి గణేశ్ మండపాల నిర్వాహకులతో మాట్లాడారు. గణేశ్ మండపాల వివరాలను ఆన్లైన్లో నమోదుచేసుకోవాలన్నారు.