సింగరాయకొండలో కురుస్తున్న వర్షం
ప్రకాశం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో సింగరాయకొండలో మంగళవారం ఉదయం నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. దీనితో ప్రజలు, పనికి వెళ్లే కూలీలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. జిల్లా కలెక్టర్ రాజబాబు ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది.