గుంతలమయంగా దారులు.. ప్రాణాపాయంలో చిన్నారులు

గుంతలమయంగా దారులు.. ప్రాణాపాయంలో చిన్నారులు

సూర్యాపేట: డ్రైనేజీ పనుల పేరుతో తవ్విన గుంతలను పూడ్చకపోవడంతో ప్రజలు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని సామాజిక కార్యకర్త కిరణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. నెలల తరబడి పనులు పెండింగ్‌లో ఉండటంతో విద్యార్థులు, వృద్ధులు ప్రమాదాల బారిన పడుతున్నారని మండిపడ్డారు. అధికారులు తక్షణమే స్పందించి ప్రమాదకర గుంతలను పూడ్చి సమస్యను పరిష్కరించాలని ఈరోజు ఆయన డిమాండ్ చేశారు.