అన్నారం దర్గా చెరువు కట్టకు మరమ్మతులు

అన్నారం దర్గా చెరువు కట్టకు మరమ్మతులు

WGL: పర్వతగిరి మండలంలోని అన్నారం దర్గా చెరువు కట్ట, తూము వర్షాలకు కోతకు గురి కావడంతో తహసీల్దార్ వెంకటస్వామి, ఎంపీడీవో శంకర్ నాయక్ సందర్శించారు. ఈ మేరకు పరిస్థితిని సమీక్షించిన అనంతరం, ఇసుక బస్తాలు వేయించి తాత్కాలిక మరమ్మతు పనులు చేపట్టారు. కాగా, ఇరిగేషన్, ఆర్&బి అధికారులు, పంచాయతీ కార్యదర్శి, ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.