VIDEO: సమ్మె కాలపు వేతనం చెల్లించాలి

ప్రకాశం: కనిగిరి మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు బుధవారం ధర్నాను చేపట్టారు. సీఐటీయూ జిల్లా నాయకులు కేశవరావు మాట్లాడుతూ.. సమ్మె కాలపు 16 రోజులకు వేతనాలను చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులను ఆప్కాస్‌లో కొనసాగించాలని, ఇంజనీరింగ్ కార్మికులకు వారాంతపు సెలవులను అమలు చేయాలని కోరారు.