రైతు నరసయ్యను పరామర్శించిన.. మంత్రి సీతక్క

రైతు నరసయ్యను పరామర్శించిన.. మంత్రి సీతక్క

MHBD: బుర్కగుంపు గ్రామానికి చెందిన రైతు మల్లెల నరసయ్య కుటుంబ కలహాల నేపథ్యంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే నర్సంపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను రాష్ట్ర మంత్రి సీతక్క ఆదివారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుంచి తెలుసుకున్న మంత్రి, నరసయ్యకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు.