VIDEO: రోడ్లపై విక్రయాలు.. వ్యాపారుల ఆందోళన

VIDEO: రోడ్లపై విక్రయాలు.. వ్యాపారుల ఆందోళన

MNCL: బెల్లంపల్లి పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై కూరగాయలు విక్రయిస్తున్నారంటూ కూరగాయల మార్కెట్ వ్యాపారులు మంగళవారం రాత్రి ఆందోళనకు దిగారు. మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో ఎక్కడపడితే అక్కడ విక్రయాలు సాగిస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నారని మండిపడ్డారు. రోడ్లపై కూరగాయలు విక్రయించే వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.