నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ కీలక ఆదేశాలు

NLG: జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కరించాలని, ఫోక్సో, గ్రేవ్ కేసుల్లో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లు గుర్తించి చర్యలు తీసుకోవాలని , వినాయక చవితి, ఈద్ మిలాద్ శాంతియుతంగా జరిగేలా చూడాలన్నారు.