VIDEO: మొబైల్ షాపులో చోరీ.. నిందితుడి అరెస్ట్
SDPT: చేర్యాలలోని మొబైల్ షాపులో నిన్న చోరీకి పాల్పడ్డ వ్యక్తిని 24 గంటల్లో పోలీసులు అరెస్టు చేశారు. కొమురవెల్లిలో పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా నిందితుడు అనుమానాస్పదంగా కనిపించాడు. అతడిని విచారించగా అనంతపురం జిల్లాకు చెందిన శివకుమార్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు వివరాలను CI రమేశ్ నాయక్, కొమురవెల్లి SI మహేశ్ వెల్లడించారు.