నులిపురుగుల మాత్రలు పంపిణీ

ELR: జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా బుట్టాయిగూడెం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో విద్యార్థులకు నులిపురుగుల మాత్రలను పంపిణీ చేశారు. ప్రతి విద్యార్థి తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని ప్రిన్సిపల్ మనేంద్రరావు అన్నారు. చేతి గోర్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకుని వాటిలోకి మలినాలు చేరకుండా జాగ్రత్త పడాలని సూచించారు.