రాష్ట్రంలో దారుణ హత్య
AP: పల్నాడు జిల్లాలో దారుణ హత్య చోటుచేసుకుంది. నరసరావుపేట మండలం ములకలూరు శివారులో ఓర్చు పర్వాతాలు అనే వ్యక్తిపై గడ్డపార, కర్రలతో ప్రత్యర్థులు దాడి చేశారు. దీంతో ఘటనాస్థలంలోనే అతడు కుప్పకూలి మరణించాడు. ఓర్చు పర్వాతాలుకు వేముల వెంకటేశ్వర్లు అనే వ్యక్తితో కొన్నేళ్లుగా వివాదం నెలకొన్నట్లు తెలుస్తోంది. హత్యపై కేసు నమోదు చేసిన నరసరావుపేట గ్రామీణ పోలీసులు విచారణ చేపట్టారు.