పాఠశాల సామాగ్రి ధ్వంసం చేసిన ఆకతాయిలు
SDPT: కొమురవెల్లి మండలం గురువన్నపేట ZP ఉన్నత పాఠశాలలో ఆకతాయిలు మరుగుదొడ్ల డోర్లు, ఎలక్ట్రిసిటీ మీటర్ వైర్, తాగునీటి ట్యాపులు ధ్వంసం చేశారు. సోమవారం కలెక్టర్ కె. హైమావతి పాఠశాలను పరిశీలించారు. అలాగే వాటికి మరమ్మతులు చేయాలని ఆదేశించారు. దోషులపై పోలీస్ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాలు, కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.