నేడు ఈ గ్రామాలలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం

నేడు ఈ గ్రామాలలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం

కాకినాడ: కుయ్యేరు నుంచి కాజులూరు వరకు కొత్త విద్యుత్తు లైన్ వేసే పనులు చేపట్టిన కారణంగా బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు అంతరాయం కలుగుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎన్. ఉదయాభాస్కర్ తెలిపారు.కుయ్యేరు, అయితంపూడి, దుగ్గదూరు, ఉప్పుమిల్లి, చింతల్లంక, రేగుబాడవ, పల్లిపాలెం గ్రామాల్లో సరఫరా ఉండదన్నారు.