'మారేడుమిల్లికి పర్యాటకులు రావొద్దు'

ASR: రంపచోడవరం డివిజన్లో భారీ వర్షాలకు వాగులు పొంగి ప్రవహిస్తున్నందున పర్యాటకులు రావద్దని సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్ గురువావరం ఓ ప్రకటనలో తెలిపారు. మారేడుమిల్లి, రంపచోడవరం తదితర ప్రాంతాల్లో పర్యాటక ప్రాంతాలన్నీ మూసివేయాలని ఆదేశించారు. గ్రామాల్లో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కాలువలు, వాగులను ప్రజలు దాటవద్దన్నారు.