VIDEO: ఇసుక లారీ బోల్తా.. తప్పిన పెను ప్రమాదం
E.G: పెద్దాపురం ఏడీబీ (ADB) రహదారిపై ఇసుక లోడుతో వెళ్తున్న లారీ సోమవారం సాయంత్రం బోల్తా పడింది. అయితే ఎదురుగా వస్తున్న ప్రయాణికుల వాహనాన్ని తప్పించే క్రమంలో లారీ అదుపు తప్పిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆ సమయంలో అటువైపు ఎవరు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు.