నారాయణపేటలో జెండా ఎగురవేయనున్న మంత్రి శ్రీహరి

NRPT: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15న నారాయణపేట పరేడ్ మైదానంలో జాతీయ జెండాను క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 10 గంటలకు పరేడ్ మైదానంలో జెండాను ఆవిష్కరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.