5వ బాలోత్సవం లోగో, బ్రోచర్ ఆవిష్కరించిన కలెక్టర్

5వ బాలోత్సవం లోగో, బ్రోచర్ ఆవిష్కరించిన కలెక్టర్

కర్నూలు: డిసెంబర్ 9, 10 తేదీల్లో జరగనున్న మాంటిస్సోరి ఇండస్ పాఠశాల 5వ బాలోత్సవం-2025 సన్నాహకాలు కొనసాగుతున్నాయి. కార్యక్రమ అధికారిక లోగోను కలెక్టర్ డా. సిరి ఆవిష్కరించారు. బాలోత్సవం పిల్లల సృజనాత్మకత, ప్రతిభ, నాయకత్వం వెలుగులోనికి తీసుకొస్తుందని ఆమె పేర్కొన్నారు. నిర్ణయించిన పోటీలు, విభాగాలు, నిబంధనల ప్రకారం విద్యార్థులు నమోదు చేసుకోవాలని సూచించారు.