ఉపాధ్యాయ సమస్యల పరిస్కార పూచీకత్తు నాది: ఎమ్మెల్సీ

WGL: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కార బాధ్యత, పూచీకత్తు తనదేనని టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. వరంగల్లో నిర్వహించిన పీఆర్టీయూ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యలు పరిష్కరించే పెద్ద సంఘం తమదేనన్నారు. సంఘ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయాలన్నారు. సమస్యల పరిష్కారాన్ని తనకు వదిలేయాలన్నారు.