కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా

కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా

SRD: సిగాచి బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌కు వినతిపత్రం సమర్పించారు. రెండు రోజుల్లో జాయింట్ యాక్షన్ మీటింగ్ పెట్టి సమస్య పరిష్కరిస్తానని ప్రజలకు కలెక్టర్ హామీ ఇచ్చినట్లు జేఏసీ ఛైర్మన్ అశోక్ కుమార్ తెలిపారు.