'సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిధి'

'సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిధి'

అన్నమయ్య:  సీఎం సహాయనిది పేదలకు పెన్నిదని రాజంపేట జనసేన నేత యల్లటూరు శ్రీనివాసరాజు అన్నారు. రాజంపేట పట్టణంలోని అగ్రహారానికి చెందిన కదిరి మారయ్యకు రూ.1,51,595 చెక్కును గురువారం యల్లటూరు భవన్‌లో లబ్ధిదారుడికి అందించారు. ఆయన మాట్లాడుతూ.. వైద్య పరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.