నీటి ఎద్దడికి అధికారుల ప్రణాళిక

KRNL: ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కర్నూలు జిల్లాలో 36°Cల ఉష్ణోగ్రత నమోదవుతోంది. పలు మున్సిపాలిటీలు, గ్రామాల్లో నీటి సమస్య మొదలవుతోంది. ఈ ఏడాది నీటి ఎద్దడి నివారణకు అధికారులు ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. జిల్లాలో 889 పంచాయతీలు ఉండగా నిధులు రాగానే సమస్య ఉన్నచోట ట్యాంకర్లతో సరఫరా, బోర్ల మరమ్మతులు, నూతన పైప్‌లైన్ పనులు చేపట్టనున్నారు.