బాకీ పైసలు ఎప్పుడిస్తారని నిలదీయండి: హరీష్ రావు

బాకీ పైసలు ఎప్పుడిస్తారని నిలదీయండి: హరీష్ రావు

TG: కాంగ్రెస్, BJPలు తోడు దొంగలు అని మాజీమంత్రి హరీష్ రావు విమర్శించారు. '8 మంది BJP ఎంపీలు ఉన్నా.. ఒక్క మెడికల్ కాలేజీ తేలేకపోయారు. పక్క రాష్ట్రాలకు వేల కోట్లు ఇస్తుంటే మనకు గుండు సున్నా మిగిల్చారు. హామీలు అమలు చేయకపోగా, ప్రజలకే కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడింది. స్థానిక సంస్థల ఎన్నికలకు ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను బాకీ పైసలు ఎప్పుడిస్తారని నిలదీయండి' అని అన్నారు.