చివరి వరకు పోరాడినా తప్పని ఓటమి

చివరి వరకు పోరాడినా తప్పని ఓటమి

సొంత గడ్డపై వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓటమి చవిచూసింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 164/6 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ 157/9 పరుగులు చేసి.. 7 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. చివరి మూడు ఓవర్లలో 56 పరుగులు చేయాల్సిన స్థితిలో.. కెప్టెన్ మిచెల్ సాంట్నర్ చివరి వరకు పోరాడినప్పటికీ, జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయాడు.