బస్టాప్ లేక ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

మంచిర్యాల జిల్లా: నస్పూర్ మండలంలో సిసిసి ఎక్స్ రోడ్ వద్ద బస్టాప్ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్ స్టాప్ సౌకర్యం లేకపోవడంతో ఆర్టీసీ బస్సుల కోసం ప్రయాణికులు ఎండలోనే పడిగాపులు కాస్తున్నారు. దీంతో పలువురు వృద్ధులు అలసటకు గురవుతున్నారు. అధికారులు ప్రతినిధులు చొరవ తీసుకొని బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.