ఎస్పీ ఆఫీసులో గ్రీవెన్స్‌కు 36 వినతులు

ఎస్పీ ఆఫీసులో గ్రీవెన్స్‌కు 36 వినతులు

కోనసీమ: అమలాపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 36 వినతులు అందాయని ఎస్పీ రాహుల్ మీనా ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్పీ స్వయంగా పిర్యాదుదారులతో ముఖాముఖిగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.