VIDEO: దీక్షా దివాస్ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
SRPT: కేసీఆర్ ఆనాడు చేసిన దీక్షా దివాస్ చారిత్రాత్మక ఘట్టమని, ఆయన చేసిన దీక్షతోనే తెలంగాణ సాధ్యమైందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. శనివారం తుంగతుర్తి మండలం బండరామారంలో దీక్షా దివాస్ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ చావు చివరి అంచులకు పోయి పోరాడి తెలంగాణ సాధించారన్నారు.