మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు

AP: ఒడిశాలోని గోపాల్‌పూర్ సమీపంలో వాయుగుండం తీరం దాటింది. దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి, మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. వాయుగుండం కారణంగా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.