ఆశా వర్కర్స్ జిల్లా నూతన కమిటీ ఏర్పాటు

ఆశా వర్కర్స్ జిల్లా నూతన కమిటీ ఏర్పాటు

NGKL: తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ 3వ మహాసభలు పట్టణంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా నూతన కమిటీ ఏర్పాటు చేశారు. అధ్యక్షురాలిగా జయమ్మ, ప్రధాన కార్యదర్శిగా కళావతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సదర్భంగా వారు మాట్లాడుతూ.. రాబోవు మూడున్నర ఏళ్లలో జిల్లాలో ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని వెల్లడించారు.