కామేపల్లిలో వైభవంగా శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి తిరునాళ్ల
BPT: మండల పరిధిలోని కామేపల్లి గ్రామంలో వెలసిన శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం మంగళవారం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా జరిగింది. ఏటా నిర్వహించే ఈ వేడుకలకు ఈ ఏడాది భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.