రైల్వే రోడ్డు మూసివేతపై ఎమ్మెల్యే వినతి

రైల్వే రోడ్డు మూసివేతపై ఎమ్మెల్యే వినతి

GNTR: శ్యామలానగర్ నుంచి వెంగలాయపాలెం వరకు ఉన్న రైల్వే రోడ్డు మూసివేతపై ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు గుంటూరు రైల్వే డివిజనల్ మేనేజర్ సుధేష్ణ సేన్‌ను కలిసి శనివారం వినతిపత్రం సమర్పించారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రోడ్డును తెరిచి ఉంచాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన డీఆర్‌ఎం, స్థానికులు ఆధార్ కార్డు చూపి అనుమతి పొందవచ్చని తెలిపారు.