లక్షాగృహ దహన ఉత్సవం

NLR: మూలాపేటలోని శ్రీ కృష్ణ ధర్మరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి లక్షాగృహ దహన ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆలయ కార్యనిర్వహణాధికారి జానకమ్మ ఆధ్వర్యంలో ఉభయకర్తలు, ఆలయ అర్చకులు, పాలకమండలి సభ్యులు వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకను తిలకించడానికి భక్తులు విశేషముగా తరలివచ్చారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.