'బీసీ ఆక్రోష సభను విజయవంతం చేద్దాం'

'బీసీ ఆక్రోష సభను విజయవంతం చేద్దాం'

MBNR: నవంబర్ 15వ తేదీన కామారెడ్డిలో నిర్వహించబోయే బీసీ ఆక్రోష సభను విజయవంతం చేద్దామని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక నాయకులు గౌనికాడి రాములు యాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం దేవరకద్రలో నిర్వహించిన కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 42 శాతం రిజర్వేషన్ కల్పించకుండా ప్రభుత్వాలు బీసీల హక్కులతో ఆడుకుంటున్నాయని వెల్లడించారు.