VIDEO: ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు తప్పని అవస్థలు
HNK: ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణం సాఫీగా సాగుతుందనుకున్న ప్రయాణికులకు నిరాశ ఎదురవుతోంది. బుధవారం ఐనవోలు మండలం పంతిని వద్ద వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ఎలక్ట్రిక్ బస్సు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మార్గమధ్యంలోనే నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు.