బీచ్‌లో అలల తాకిడికి ఒకరు మృతి

VSP: భీమిలి సాగర తీరంలో గొల్లలపాలేనికి చెందిన అప్పల రెడ్డి (45) ఆదివారం ఉదయం తన పిల్లలతో కలిసి బీచ్‌కు వచ్చారు. సముద్రంలో స్నానం చేస్తుండగా అలల ఉద్ధృతికి కొట్టుకుపోయి గల్లంతయ్యారు. కొంతసేపటికి ఆయన మృతదేహం ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. సీఐ తిరుమలరావు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.