ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ
W.G: భీమవరంలోని ఓ కల్యాణ మండపంలో గత 5 రోజులుగా జరుగుతున్న జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్లో భాగంగా టీ-ఐసీఆర్పీఎస్‌లకు శుక్రవారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. డా. వై. నూకరాజు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ నిర్వహించి, విధులకు సంబంధించి పలు సూచనలు చేశారు. వరిలో వచ్చే పురుగులు, తెగుళ్ల నివారణ కోసం ఉపయోగించాల్సిన కషాయాలు, వాటి తయారీ గురించి ఆయన వివరించారు.