అసెంబ్లీ మార్షల్స్‌పై మంత్రి లోకేష్ సీరియస్
GNTR: అసెంబ్లీలో MLAలు, మీడియాపై మార్షల్స్ దురుసు ప్రవర్తనపై మంత్రి నారా లోకేశ్ సీరియస్ అయ్యారు. MLA ధూళిపాళ్ల నరేంద్ర మీడియా ప్రతినిధులతో మాట్లాడుతుండగా మార్షల్స్ అక్కడి నుంచి వెళ్లిపోవాలని నరేంద్రపై చేయి వేసి నెట్టే ప్రయత్నం చేశారు. అప్పుడే బయటకు వచ్చిన మంత్రి లోకేష్ ఇంకా తాడేపల్లి ప్యాలెస్ పాలనలో ఉన్నామనుకుంటున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారంటూ సమాచారం.