పంచారామ క్షేత్రంలో వరలక్ష్మి వ్రత పూజలు

E.G: సామర్లకోట పంచారామ భీమేశ్వర స్వామి ఆలయంలో ఆగస్టు 15న శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రత పూజలను ఏర్పాటు చేసినట్లు ఈవో బళ్ల నీలకంఠం గురువారం తెలిపారు. వరలక్ష్మి పూజలో పాల్గొనే మహిళలు కలశం, రవిక మాత్రమే తీసుకురావాలని ఇతర పూజ సామాగ్రి ఆలయంలో ఉచితంగా అందిస్తామన్నారు. మహిళలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.