ఉమ్మడి జిల్లాలో స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా 419 సీట్లు భర్తీ

ఉమ్మడి జిల్లాలో స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా 419 సీట్లు భర్తీ

KMM: ఉమ్మడి జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించారు. భద్రాచలంలోని గిరిజన గురుకుల కళాశాలలో నిర్వహించిన కౌన్సెలింగ్‌లో 419 సీట్లు భర్తీ అయ్యాయని గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ అరుణకుమారి తెలిపారు. 5 నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహించగా బాలికలు 121 మంది, బాలురు 298 మంది చేరారు.