'రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారం తగదు'

ప్రకాశం: కనిగిరి ఆర్డీవో కార్యాలయంలో ఎరువుల దుకాణం యజమానులు, వ్యవసాయ శాఖ అధికారులతో గురువారం ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సమావేశం నిర్వహించారు. ఎరువుల కొరతలేదని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం రైతులు ఇబ్బంది పడేలా తప్పుదారి పట్టించేలా ప్రతిపక్ష పార్టీ తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు. రైతులకు మేలు చేసేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.