VIDEO: శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో క్యూలైన్లను పరిశీలించిన ఈవో
TPT: శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో క్యూ లైన్లను శనివారం ఈవో బాపిరెడ్డి పరిశీలించారు. ఇందులో భాగంగా కార్తీక మాసం వరుస సెలవులు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. దీంతో అప్రమత్తమైన ఈవో క్యూ లైన్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు.